Heavy Traffic Jam: మనాలీలో భారీ ట్రాఫిక్‌ జామ్‌... మంచులో చిక్కుకుపోయిన వెయ్యికిపైగా వాహనాలు

Heavy Traffic Jam in Manali

  • క్రిస్మస్ వేడుకలకు మనాలీకి పర్యాటకులు 
  • చిక్కుకుపోయిన 700 మంది పర్యాటకుల తరలింపు  
  • అవస్థలు పడుతున్నా వెనక్కు వెళ్లేందుకు ఇష్టపడని పర్యాటకులు

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలి ప్రాంతంలో పెద్ద ఎత్తున మంచు కురుస్తోంది. ఈ మంచు కారణంగా సోలాంగ్‌, అటల్‌ టన్నెల్‌, రోహ్తాంగ్‌ మధ్య రవాణాకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. అధికారిక సమాచారం ప్రకారం సుమారు వెయ్యికి పైగా వాహనాలు మంచులో కూరుకుపోయాయని, దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయినట్టు అధికారులు తెలియజేశారు.  దీంతో పోలీసులు రెస్క్యు ఆపరేషన్‌ ప్రారంభించారు. మంచులో చిక్కుకుపోయిన 700 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పోలీసులతో పాటు స్థానిక అధికారులు కూడా ఈ రెస్క్యు ఆపరేషన్‌లో పాలుపంచుకున్నారు.  

ప్రతిఏడాది క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకల కోసం పెద్ద ఎత్తున పర్యాటకులు మనాలి ప్రాంతానికి వస్తుంటారు.  ఈ సమయంలో భారీగా మంచు కురవడంతో ఒక్కసారిగా మనాలిలో పరిస్థితులు మారిపోయాయి. డిసెంబర్‌ 8న మొదటిసారి మంచు కురిసింది. కాగా, హఠాత్తుగా డిసెంబర్‌ 23న మరోసారి మంచు కురవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచు పెద్ద ఎత్తున కురుస్తున్నప్పటికీ పర్యాటకులు వెనక్కు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. వైట్‌ క్రిస్మస్‌ కలలను సాకారం చేసుకునేందుకు వస్తున్నామని వారు చెబుతున్నారు.  

'మంచు ఎంతో అందంగా ఉంది. ఇక్కడి వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. దీన్ని మేము ఊహించలేదు. ఉదయం పెద్ద ఎత్తున మంచు కురవడంతో వెళ్లిపోవాలని అనుకున్నాము. కానీ, ఇప్పుడు ఇక్కడే మరికొన్ని రోజులు ఉండి ఈ వాతావరణాన్ని ఎంజాయ్‌ చేయాలని అనుకుంటున్నాం' అని హర్యానాకు చెందిన పర్యాటకుడు హేమంత్‌ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News