Bheemili Bhogapuram: ప్రతిపాదిత భీమిలి - భోగాపురం రోడ్డు అలైన్‌మెంట్ రద్దు చేయాలి: బాధితుల డిమాండ్

Demand on Bheemili Bhogapuram proposed alignment cancellation

  • భీమిలి మండలం నేరెళ్లవలస వద్ద నచ్చినట్లు రహదారిని వంపులు తిప్పారన్న బాధితులు
  • వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల ఫిర్యాదుల వేదికలో బాధితుల వినతులు
  • వైసీపీ ఎంపీ సంబంధీకులు దానికి ఇరువైపుల భూములు కొనుగోలు చేశారని ఆరోపణ

ప్రతిపాదిత భీమిలి – భోగాపురం రోడ్డు అలైన్‌మెంట్ రద్దు చేయాలని పలువురు అధికారులకు వినతి పత్రాలను అందించారు. సోమవారం విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల ఫిర్యాదుల వేదిక (పీజీఆర్ఎస్)లో వినతులు అందించారు. 

వైసీపీ నేతలు తమ ఆస్తుల విలువ పెంచుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో భీమిలి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ రహదారి అలైన్‌మెంట్‌ను నచ్చినట్లు మార్చేశారని బాధితులు పేర్కొన్నారు. ఆ రోడ్డుకు సంబంధించిన ప్రతిపాదనలు ముందే తెలిసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంబంధీకులు దానికి ఇరువైపుల భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. కేవలం వారి ఆస్తుల విలువ పెంపు కోసమే భీమిలి మండలం నేరెళ్లవలస వద్ద నచ్చినట్లు రహదారిని వంపులు తిప్పారని దీని వల్ల సామాన్య ప్రజలు నష్టపోతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 

మధ్యతరగతి, విశ్రాంత ఉద్యోగుల ఆస్తులకు నష్టం కలిగేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని వారు పేర్కొన్నారు. వుడా అనుమతి ఉందన్న ధైర్యంతో పలు ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేశామని, వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ – 2041 లో అవేమీ పట్టించుకోకుండా అన్యాయంగా ప్లాట్ల మధ్య నుంచి రోడ్డు ప్రతిపాదన చేయడం దారణమన్నారు. ఆ అలైన్‌మెంట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  

  • Loading...

More Telugu News