Vishnu Vardhan Reddy: అల్లు అర్జున్ పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు... విష్ణు వర్ధన్ రెడ్డి ఫైర్

Vishnu Vardhan Reddy fires on Congress MLA Bhupathi Reddy

  • రాజకీయ రంగు పులుముకున్న సంధ్య థియేటర్ ఘటన
  • అల్లు అర్జున్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
  • ఆంధ్రోడివి ఆంధ్రోడిలానే ఉండు అంటూ వార్నింగ్
  • 11 ఏళ్ల తర్వాత కూడా ఈ రెచ్చగొట్టే మాటలు ఏంటి అంటూ విష్ణు ఆగ్రహం 

సంధ్య థియేటర్ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హీరో అల్లు అర్జున్ పై చేసిన తీవ్ర వ్యాఖ్యల పట్ల ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. విభజన జరిగి ఇన్నేళ్లయినా పరిస్థితి మారలేదంటూ మండిపడ్డారు.

నువ్వు ఆంధ్రోడివి... ఆంధ్రోడిలానే ఉండు ఇక్కడ... బతకడానికి వచ్చావు... నేను రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నా... మీకిచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ వ్యాపారాలు చేసుకోండి... కానీ మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు... ఖబడ్దార్ అంటూ భూపతిరెడ్డి హెచ్చరించారు.

భూపతిరెడ్డి వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ... ఏపీ వాళ్లు తెలంగాణలో ఉండాలంటే ప్రత్యేకంగా వీసా తీసుకోవాలా? అని ప్రశ్నించారు. 11 ఏళ్ల తర్వాత కూడా ఈ రెచ్చగొట్టే మాటలు ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మీ కాంగ్రెస్ సంస్కృతి? మీ ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలి... లేదంటే తెలంగాణ సమాజం సైతం మీ కాంగ్రెస్ పార్టీని క్షమించదు అని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News