PV Sindhu: పీవీ సింధు రిసెప్ష‌న్‌లో సంద‌డి చేసిన‌ సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖులు.. ఇవిగో వీడియోలు!

PV Sindhu and Venkata Sais Wedding Reception in Hyderabad
  • ఈ నెల 22న పెళ్లి చేసుకున్న‌ పీవీ సింధు, వెంక‌ట ద‌త్త‌సాయి 
  • మంగళవారం రాత్రి హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా వివాహ రిసెప్ష‌న్‌ 
  • ఈ వేడుక‌కు హాజ‌రైన సీఎం రేవంత్‌, చిరు, నాగ్‌, అజిత్ త‌దిత‌రులు
భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు, పోసిడెక్స్ టెక్నాల‌జీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ వెంక‌ట ద‌త్త‌సాయి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ నెల 22న రాత్రి 11.20 గంట‌ల‌కు సింధు మెడలో వెంక‌ట ద‌త్త‌సాయి మూడు ముళ్లు వేశారు. ఈ వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. రాజస్థాన్‌లోని ఉద‌య్‌సాగ‌ర్ స‌ర‌స్సులో ఉన్న ర‌ఫ‌ల్స్ హోట‌ల్ ఈ వివాహ వేడుక‌కు వేదిక‌గా నిలిచింది.   

ఇక తాజాగా వీరి పెళ్లి రిసెప్షన్‌ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున, త‌మిళ స్టార్ హీరో అజిత్‌, న‌టి రోజా, సింగ‌ర్ మంగ్లీ సహా పలువురు ప్రముఖులు సందడి చేశారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.
PV Sindhu
Venkata Dutta Sai
Wedding Reception
Hyderabad

More Telugu News