CPI Narayana: 'పీలింగ్స్' సాంగ్ చేయడం రష్మిక మందన్నకు ఇష్టం లేదు: సీపీఐ నారాయణ

Rashmika Mandanna not interested to do Peellings song says CPI Narayana

  • 'పీలింగ్స్' సాంగ్ లో అందాలు ఆరబోసిన రష్మిక
  • డైరెక్టర్ చెప్పడం వల్లే రష్మిక ఆ పాటకు డ్యాన్స్ చేసిందన్న సీపీఐ నారాయణ
  • ఒక ఎర్రచందనం దొంగను హీరోగా చూపించారని మండిపాటు

'పుష్ప-2' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 1,600 కోట్లు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలోని 'పీలింగ్స్' అనే పాట దుమారం రేపుతోంది. ఈ పాటలో హీరోయిన్ రష్మిక మందన్న అందాలను ఆరబోసింది. ఈ సాంగ్ పై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

'పీలింగ్స్' పాటకు డ్యాన్స్ చేయడం రష్మిక మందన్నకు ఇష్టం లేదని నారాయణ చెప్పారు. డైరెక్టర్ చెప్పడం వల్లే ఆమె డ్యాన్స్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. సినీ పరిశ్రమలో ఎంతో మంది మహిళలు ఆత్మాభిమానాన్ని చంపుకుని పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

'పుష్ప-2' సినిమాపై కూడా నారాయణ విమర్శలు గుప్పించారు. క్రైమ్, అశ్లీలత ఉన్న సినిమాలకు ప్రభుత్వాలు ఎందుకు రాయితీలు ఇస్తున్నాయని ప్రశ్నించారు. ఒక ఎర్రచందనం దొంగను హీరోగా చూపించారని మండిపడ్డారు. రూ. 100 టికెట్ ను రూ. 1,000 చేయడం ఎందుకని ప్రశ్నించారు. సినిమా హీరోలు రోడ్ షోలు చేయడం ఎందుకని అడిగారు.

  • Loading...

More Telugu News