TS High Court: గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

TG High Court dismisses group 1 petitions

  • రిజర్వేషన్ల అంశం తేలేవరకు ఫలితాలు ప్రకటించకుండా చూడాలని పిటిషన్లు
  • హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
  • విచారించి.. పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

గ్రూప్-1 పరీక్షలపై కొంతమంది అభ్యర్థులు వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్ల అంశం తేలేవరకు గ్రూప్ 1 పరీక్ష ఫలితాలను ప్రకటించకుండా చూడాలని అభ్యర్థులు తమ పిటిషన్‌లో కోరారు. ఈ మేరకు ఫలితాలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్‌లలో కోరారు. విచారించిన న్యాయస్థానం వారి పిటిషన్లను కొట్టివేసింది.

  • Loading...

More Telugu News