Manchu Vishnu: తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం: మంచు విష్ణు

Manchu Vishnu responds on Tollywood representatives met CM Revanth Reddy

  • సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల సమావేశం
  • సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చ
  • ఎక్స్ లో స్పందించిన మా అధ్యక్షుడు మంచు విష్ణు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కావడంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. 

"తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులను కలిశారు. ఈ సమావేశంలో 'మా' సభ్యులు కూడా పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమకు ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పరిచేందుకు క్రియాశీలక మద్దతు ఇస్తుండడం అభినందనీయం. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం" అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News