Australia vs India: బాక్సింగ్ డే టెస్టు.. స్మిత్‌ సెంచ‌రీ.. భారీ స్కోర్ దిశ‌గా ఆసీస్‌

Australia vs India 4th Test at Melbourne

  • మెల్‌బోర్న్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు
  • భోజ‌న విరామానికి ఆసీస్ స్కోరు 454/7
  • స్టీవ్ స్మిత్ అజేయ శ‌త‌కం (139 నాటౌట్)
  • త్రుటిలో హాఫ్ సెంచ‌రీ (49) చేజార్చుకున్న కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ 

మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రుగుతున్న‌ బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు తొలి సెష‌న్ ముగిసింది. ఓవ‌ర్‌నైట్ స్కోర్ 311/6 తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆతిథ్య జ‌ట్టు దూకుడుగా ఆడింది. దీంతో రెండో రోజు భోజ‌న విరామానికి ఆసీస్ స్కోరు 454/7 గా ఉంది. స్టీవ్ స్మిత్ అజేయ శ‌త‌కం (139 నాటౌట్)తో క‌దంతొక్కాడు. ఈ సెష‌న్‌లో ఆస్ట్రేలియా జ‌ట్టు ఒక వికెట్ మాత్ర‌మే కోల్పోయి 143 ర‌న్స్ చేయ‌డం విశేషం. 

ఆసీస్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ త్రుటిలో హాఫ్ సెంచ‌రీ (49) చేజార్చుకున్నాడు. స్మిత్‌తో క‌లిసి ఎనిమిదో వికెట్‌కు క‌మ్మిన్స్ ఏకంగా 112 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. ఇక మొద‌టి రోజు కూడా ఆతిథ్య జ‌ట్టు టాప్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు సామ్ కాన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖావాజా (57), ల‌బుషేన్ (72) అర్ధ శ‌త‌కాలు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా 3 వికెట్లు తీస్తే.. ర‌వీంద్ర జ‌డేజా 2, ఆకాశ్ దీప్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. 

  • Loading...

More Telugu News