Manmohan Singh: మన్మోహన్ సింగ్‌ను రాజకీయాల్లోకి తెచ్చింది మన పీవీనే!
- ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న మన్మోహన్‌ను రాజకీయాల్లోకి తెచ్చిన పీవీ
- 1991లో మన్మోహన్‌ను రాజ్యసభకు పంపి ఆర్థిక మంత్రిని చేసిన పీవీ
- 1991 నుంచి 1996 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్
- 1992లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన పీవీ, మన్మోహన్ సింగ్
- వరంగల్‌తో మన్మోహన్‌కు ప్రత్యేక అనుబంధం
- రుణమాఫీకి ఆద్యుడు మన్మోహన్ సింగ్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు చెప్పగానే ఆయన 'అసలేం మాట్లాడరు' అని అంతా అంటుంటారు. అవును, అది నిజమే. కానీ, చాలా మంది రాజకీయ నేతల్లా ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు. చేతల్లో చూపించే నేత. 1991 నుంచి 1996 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్.. ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు.
గురువుకు తగ్గా శిష్యుడు!
ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న మన్మోహన్‌కు రాజకీయాలు పరిచయం చేసింది మన పీవీ నరసింహారావు అనే చెప్పాలి. 1991లో దుర్భర ఆర్థిక పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి మన్మోహన్‌ను రాజ్యసభకు పంపి ఆర్థిక మంత్రిని చేశారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పాలసీతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణ ద్వారా నాటి సంస్కరణలు నేటికీ చిరస్థాయిగా నిలిచాయి.
1992లో పీవీ, మన్మోహన్ సింగ్ కలిసి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే ప్రపంచంలో మన దేశం తలెత్తుకుని నిలబడేలా చేశాయని ఆర్థిక నిపుణులు చెప్పే మాట. అలా మన పీవీకి గురువుకు తగ్గ శిష్యుడిగా మన్మోహన్ పేరు తెచ్చుకున్నారు. మాటలు లేవు.. మాట్లాడేది లేదు. కేవలం తమ పనులతోనే సమాధానం చెప్పుకుంటూ వెళ్లిపోయారు.
వరంగల్‌తో ప్రత్యేక అనుబంధం
వరంగల్‌తో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రత్యేక అనుబంధం ఉంది. వరంగల్‌లోని కాజీపేట ఆర్ఈసీలో 1992లో జరిగిన కాకతీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి నాడు కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో మన్మోహన్ హాజరయ్యారు. కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ జయశంకర్ సారథ్యంలో జరిగిన వేడుకల్లో ఆయన చేతుల మీదుగానే అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
ప్రజలకు 'ఉపాధి' కల్పించింది మన్మోహనే
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలకు పని కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు. 1991లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలను ప్రధానిగా ఆయన కొనసాగించారు. తద్వారా విదేశీ పెట్టుబడులు, ప్రైవేటీకరణ, లైసెన్సింగ్, విధానాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
రుణమాఫీకి ఆద్యుడు మన్మోహన్ సింగ్
ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా రైతు రుణమాఫీ అనేది కామన్ హామీగా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకానికి ఆద్యుడు మన్మోహన్ సింగ్. 2008లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది రైతులకు రూ. 72వేల కోట్ల రుణమాఫీ చేసింది. ఆ డేరింగ్ నిర్ణయం కారణంగానే యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చింది.