Manmohan Singh: ఉపాధి హామీ పథకం మన్మోహన్ ఘనతే!
- 2004 లో ప్రధానిగా గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభం
- చారిత్రాత్మక సమాచార హక్కును తీసుకొచ్చిందీ ఆయనే
- మన్మోహన్ పాలనలో ఆహార భద్రత చట్టం
మన్మోహన్ సింగ్ పదేళ్ల పాలనలో నాటి యూపీఏ ప్రభుత్వం పలు చారిత్రాత్మక చట్టాలు చేసింది. అందులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేని సమయంలో కూలీలకు ఉపాధి కల్పించడం కోసం ఈ పథకానికి రూపకల్పన చేశారు. 2004లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. వంద రోజుల పాటు వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించింది. సోనియా గాంధీ నేతృత్వంలోని జాతీయ సలహా మండలిలో ఈ పథకం రూపుదిద్దుకుంది.
దీంతో పాటు సమాచార హక్కును యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లను 2005లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అమలులోకి తెచ్చారు. విద్యారంగంలోనూ మన్మోహన్ కీలక సంస్కరణలు అమలు చేశారు. ఎడ్యుకేషన్ లో ఓబీసీ రిజర్వేషన్ అమలు చేసింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే. 2009 లో లోక్ సభ ఎన్నికల వేళ మెగా ఫార్మ్ లోన్ ప్యాకేజీ ప్రకటించారు. అంతకుముందు ఆహార భద్రత చట్టం (ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్) ను మన్మోహన్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు అమలులోకి తెచ్చింది.