Jagan: పార్టీ శ్రేణులు కనబరుస్తున్న అంకితభావానికి, చిత్తశుద్ధికి హ్యాట్సాఫ్‌: జగన్

Jagan appreciates YCP cadre who participated in protests
  • కూటమి సర్కారు విద్యుత్ చార్జీలు పెంచిందంటూ వైసీపీ ఫైర్
  • రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు
  • ధర్నా కార్యక్రమాలు విజయవంతం అయ్యాయన్న జగన్
  • పార్టీ శ్రేణులను అభినందిస్తూ ట్వీట్
కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజల నడ్డి విరగ్గొడుతోందని, ఛార్జీలు తగ్గించాల్సిందేనంటూ వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టడం తెలిసిందే. దీనిపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు.

రాష్ట్రంలో కరెంటు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ గళం విప్పిన ప్రజలకు తోడుగా, ప్రజల పక్షాన వైసీపీ చేపట్టిన నిరసనలను విజయవంతం చేసిన వైసీపీ నేతలకు, కార్యకర్తలకు అభినందనలు అంటూ జగన్ ట్వీట్ చేశారు.

"పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలకు బాసటగా నిలుస్తూ, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. ప్రజల తరఫున, ప్రజా సమస్యల పట్ల పార్టీ శ్రేణులు కనబరుస్తున్న అంకితభావానికి, చిత్తశుద్ధికి హ్యాట్సాఫ్" అంటూ పార్టీ క్యాడర్ ను ఉత్తేజపరిచేలా జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 
Jagan
YSRCP
Protests
Andhra Pradesh

More Telugu News