Pawan Kalyan: పవన్ కల్యాణ్ పర్యటనలో భద్రతా లోపం.. హోం మంత్రి అనిత సీరియస్

Home minister Anitha serious on security lapse during Pawan Kalyan Manyam trip

  • పవన్ మన్యం పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యం
  • పవన్ చుట్టూ తిరిగిన నకిలీ ఐపీఎస్
  • విచారణకు ఆదేశించిన వంగలపూడి అనిత

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మన్యం పర్యటనలో భద్రతా లోపంపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ మన్యం పర్యటన సందర్భంగా ఓ నకిలీ ఐపీఎస్ కలకలం రేపాడు. వై కేటగిరీ భద్రతలో ఉండే పవన్ చుట్టూ బలివాడ సూర్యప్రకాశ్ రావు అనే నకిలీ ఐపీఎస్ తిరిగాడు. ఐపీఎస్ యూనిఫాంలో ఉన్న ఆయనకు కొందరు పోలీసు అధికారులు సెల్యూట్ కొట్టి, ఫొటోలు కూడా దిగారు. 

డిప్యూటీ సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం కలకలం రేపింది. దీనిపై హోం మంత్రి అనిత ఫైర్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. భద్రతా లోపంపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఐపీఎస్ యూనిఫాంలో వచ్చిన సూర్యప్రకాశ్ ను విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 20న పార్వతీపురం మన్యంలో పవన్ పర్యటించారు. అయితే, నకిలీ ఐపీఎస్ వ్యవహారాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు.

  • Loading...

More Telugu News