Nitish Kumar Reddy: బాక్సింగ్ డే టెస్టులో నితీశ్ రెడ్డి అరుదైన ఘ‌న‌త‌.. తొలి భార‌త క్రికెట‌ర్‌గా రికార్డు!

Nitish Reddy Shatters Historic Record With Australia Thrashing Becomes 1st Ever Indian

  • మెల్‌బోర్న్ వేదిక‌గా భార‌త్‌, ఆసీస్ నాలుగో టెస్టు
  • ఇప్ప‌టివ‌ర‌కు బీజీటీ సిరీస్‌లో మొత్తం 8 సిక్స‌ర్లు బాదిన యువ ఆట‌గాడు
  • దీంతో ఆసీస్‌లో సింగిల్ సిరీస్‌లో అత్య‌ధిక సిక్సులు కొట్టిన తొలి భార‌తీయ ఆట‌గాడిగా రికార్డు

మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భార‌త యువ ఆట‌గాడు నితీశ్ కుమార్ రెడ్డి అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఇప్ప‌టివ‌ర‌కు బీజీటీ సిరీస్‌లో ఈ యంగ్ ప్లేయ‌ర్ మొత్తం 8 సిక్స‌ర్లు బాదాడు. దీంతో ఆస్ట్రేలియాలో సింగిల్ సిరీస్‌లో అత్య‌ధిక సిక్సులు కొట్టిన తొలి భార‌తీయ ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు. 

అలాగే ఇంగ్లండ్ ప్లేయ‌ర్ మైఖేల్ వాన్, క‌రేబియ‌న్ ఆట‌గాడు క్రిస్ గేల్ స‌ర‌స‌న నితీశ్ రెడ్డి చేరాడు. ఆస్ట్రేలియాలో 2002-03 యాషెస్ సిరీస్ లో వాన్ 8 సిక్సులు కొట్ట‌గా, 2009-10 ఆసీస్ ప‌ర్య‌ట‌న‌లో గేల్ కూడా 8 సిక్సులే న‌మోదు చేశాడు. 

ఇక నాలుగో టెస్టులో అద్భుత‌మైన అర్ధ శ‌త‌కంతో టీమిండియాను ఫాలో-ఆన్ గండం నుంచి ఈ తెలుగు ఆట‌గాడు గ‌ట్టేక్కించిన విష‌యం తెలిసిందే. బ‌డా బ్యాట‌ర్లు ఫెయిల్ అయిన పిచ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ క్ర‌మంలోనే తొలి టెస్టు సెంచ‌రీ దిశ‌గా దూసుకెళ్తున్నాడు. ఇప్ప‌టికే వాషింగ్ట‌న్ సుంద‌ర్‌తో క‌లిసి శ‌త‌క భాగ‌స్వామ్యం అందించాడు. 

మూడోరోజు ఆట‌లో ఈ ఇద్ద‌రు అర్ధ శ‌త‌కాలు న‌మోదు చేయ‌డం విశేషం. ప్ర‌స్తుతం భార‌త్ స్కోరు 346/7 (110 ఓవ‌ర్లు) ఉండ‌గా.. క్రీజులో నితీశ్ కుమార్ రెడ్డి (95), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (50) ఉన్నారు. 

  • Loading...

More Telugu News