Samantha: బేబీ బంప్ తో సమంత.. అసలు విషయం ఇదే!

Samantha baby bump pics going viral

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత బేబీ బంప్ ఫొటోలు
  • షాక్ కు గురవుతున్న నెటిజన్లు, అభిమానులు
  • ఏఐతో ఈ ఫొటోలను క్రియేట్ చేసిన ఆకతాయిలు

టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు అగ్రనటిగా కొనసాగిన సమంత ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా నటిగా ఆమె ఎంతో బిజీగా ఉంటోంది. తాజాగా సమంతకు చెందిన కొన్ని ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఆ ఫొటోల్లో సమంత బేబీ బంప్ తో కనపడుతోంది. ఫొటోలను చూస్తున్న నెటిజన్లు, అభిమానులు షాక్ కు గురవుతున్నారు. 

తనకు మాతృత్వాన్ని అనుభవించాలని ఉందని గతంలో సమంత చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో, తన కలను ఆమె నెరవేర్చుకుందా? అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

అసలు విషయం ఏమిటంటే... సమంత నిజంగా ప్రెగ్నెంట్ కాదు. ఎవరో ఈ ఫొటోలను ఏఐని ఉపయోగించి క్రియేట్ చేశారు. సమంత ప్రెగ్నెంట్ అని గతంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

  • Loading...

More Telugu News