Triple Death: ఆ ముగ్గురి ఆత్మహత్యలో సంచలన విషయాలు వెలుగులోకి..!

Triple Death Mystery In Kamareddy District

  • చెరువులో ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, మరో యువకుడి మృతదేహాలు
  • ఆత్మహత్యకు ముందు వరకూ గంటల తరబడి ఫోన్ లో మాటలు
  • ఎస్ఐ, కానిస్టేబుల్ మధ్య వివాహేతర సంబంధం
  • అంతకుముందు నుంచే కంప్యూటర్ ఆపరేటర్ తో కానిస్టేబుల్ ప్రేమ వ్యవహారం

తెలంగాణవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ ముగ్గురి ఆత్మహత్య ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ట్రిపుల్ డెత్ కేసులో చిక్కుముడులు వీడనున్నాయి. భిక్కనూర్ ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ముగ్గురూ అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, వారి ఆత్మహత్యకు కారణాలేంటనే విషయంలో గందరగోళం నెలకొంది. ముగ్గురూ చనిపోవడం, ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరూ లేకపోవడంతో పాటు మృతులకు సంబంధించిన ఫోన్లు లాక్ ఓపెన్ కాకపోవడంతో ఈ కేసు పోలీసులకు పజిల్ గా మారింది.

మృతుల కుటుంబ సభ్యులను, వారితో పనిచేసిన సిబ్బందిని ప్రశ్నించి వివరాలు రాబడుతున్నారు. ముగ్గురి ఫోన్లను తెరిచేందుకు విఫలయత్నం చేశారు. వారి బ్యాంక్ ఖాతాలు, లాకర్లను తెరిస్తే ఏదైనా క్లూ దొరకవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం ఉన్నతాధికారుల అనుమతి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ కాల్ డేటా పరిశీలించగా చనిపోయిన రోజు ముగ్గురూ గంటల తరబడి మాట్లాడుకున్నట్లు బయటపడిందని పోలీసులు చెప్పారు. శృతి, నిఖిల్ ల మధ్య ఇటీవల వాట్సాప్ లో ఆత్మహత్యకు సంబంధించి చర్చ జరిగినట్లు అధికార వర్గాల సమాచారం. 

ఎస్ఐతో బంధం.. మరొకరితో ప్రేమ
బీబీపేట ఎస్ఐగా వచ్చిన సాయి కుమార్ మంచి వ్యక్తి అని, అందరితో కలుపుగోలుగా ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. విధినిర్వహణలో కానిస్టేబుల్ శృతితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసిందని అన్నారు. శృతికి వివాహం అయినప్పటికీ విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోందని చెప్పారు. ఎస్ఐ సాయి కుమార్ తో బంధం కన్నా ముందే శృతి కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ తో ప్రేమ వ్యవహారం నడిపిందని సమాచారం.

ఈ విషయం ఎస్ఐకి తెలిస్తే తనకు ప్రమాదమని భావించిన శృతి.. నిఖిల్ ను ఎస్ఐ సాయి కుమార్ కు దగ్గర చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరికీ కామన్ ఫ్రెండ్‌లా ఉంటే తను సేఫ్‌గా ఉండొచ్చనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సాయి కుమార్ కు భిక్కనూరుకు బదిలీ కావడంతో శృతితో గ్యాప్ పెరిగిందన్నారు. 

ఆ తర్వాత శృతి, నిఖిల్ ల ప్రేమ వ్యవహారం తెలియడంతో సాయి కుమార్ ఇద్దరినీ నిలదీశారని, ఈ విషయంపై మాట్లాడుకోవడానికే ముగ్గురూ అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు దగ్గర కలిశారని అధికారులు భావిస్తున్నారు. మాటామాటా పెరగడంతో బెదిరించేందుకు శృతి ముందుగా చెరువులో దూకి ఉండవచ్చని, ఆ తర్వాత నిఖిల్ కూడా దూకడంతో ఆందోళనకు గురైన ఎస్ఐ సాయి కుమార్ కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News