UK Woman: స్పోర్ట్స్ షూ వేసుకుందని ఉద్యోగిని తొలగింపు.. కంపెనీకి షాకిచ్చిన ట్రైబ్యునల్

UK Woman Fired For Wearing Sports Shoes At Work Wins Rs 30 Lakh In Compensation

  • డ్రెస్ కోడ్ తెలియక వేసుకొస్తే ఉద్యోగంలో నుంచి తీసేయడమేనా అని ఫైర్
  • 32 లక్షలు పరిహారం ఇవ్వాలని కంపెనీకి ఆదేశాలు
  • చిన్న చిన్న కారణాలకే తొలగింపు సరికాదన్న ట్రైబ్యునల్

కొత్తగా చేరిన ఓ ఉద్యోగిని స్పోర్ట్స్ షూ వేసుకుని ఆఫీసుకు వచ్చింది.. ఇది గమనించిన ఆమె బాస్ సీరియస్ అయ్యారు. డ్రెస్ కోడ్ పాటించలేదనే కారణంతో ఉద్యోగంలో నుంచి తొలగించింది. దీనిపై బాధితురాలు ట్రైబ్యునల్ ను ఆశ్రయించగా.. కంపెనీ తీరుపై మండిపడ్డ ట్రైబ్యునల్, బాధితురాలికి ఏకంగా 30 వేల పౌండ్లు (సుమారు రూ.32 లక్షలు) చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. చిన్న కారణాలకే ఉద్యోగంలో నుంచి తొలగించడం సరికాదని హితవు పలికింది. 

2022లో లండన్ కు చెందిన ఎలిజబెత్ బెనాస్సీ అనే యువతి మ్యాక్సిమస్ యూకే సర్వీసెస్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. కొన్ని రోజుల తర్వాత బెనాస్సీ ఓసారి స్పోర్ట్స్ షూ వేసుకుని ఆఫీస్ కు వెళ్లింది. దీనిపై బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారని, డ్రెస్ కోడ్ పాటించాలనే విషయం తెలియదా అంటూ పరుష వ్యాఖ్యలు చేశారని వాపోయింది. ఆపై తనను ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలిచ్చారని చెప్పింది. ఎలాంటి నోటీస్ లేకుండా, సడెన్ గా జాబ్ లో నుంచి తీసేయడం అన్యాయమంటూ ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది. సుదీర్ఘంగా విచారించిన ట్రైబ్యునల్.. తాజాగా తీర్పు వెలువరిస్తూ.. మ్యాక్సిమస్ యూకే సర్వీసెస్ కంపెనీ తీరు సరికాదని వ్యాఖ్యానించింది. భారీ మొత్తంలో ఫైన్ విధించింది.

  • Loading...

More Telugu News