APSRTC: హైదరాబాద్‌లోని ఏపీ వాసులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్

Special buses from Hyderabad to Andhra Pradesh for Sankranthi announced by APSRTC

  • సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు
  • జనవరి 9 నుంచి 13 మధ్య 2,400 స్పెషల్ సర్వీసులు 
  • అనదపు ఛార్జీలు లేకుండానే నిర్వహణ
  • ప్రకటించిన ఏపీఎస్‌ఆర్టీసీ

సంక్రాంతి పండుగకు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 9 నుంచి జనవరి 13 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు మొత్తం 2,400 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు వెల్లడించింది.

ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. పండుగ వేళ ప్రజలపై ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో అధికారులు తెలిపారు. చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, ఒంగోలు, మాచర్లతో పాటు వేర్వేరు ప్రదేశాలకు వెళ్లే సాధారణ బస్సులు, స్పెషల్ బస్సులు హైదరాబాద్ నగరంలోని ఎంజీబీఎస్‌కు ఎదురుగా ఉన్న సీబీఎస్ నుంచి బయలుదేరతాయని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News