ACA: నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ న‌గ‌దు బ‌హుమ‌తి

ACA Announces Rs 25 Lakh Cash Prize to Nitish Kumar Reddy

  • బీజీటీలో అద్భుతంగా రాణిస్తున్న తెలుగు కుర్రాడు 
  • మెల్‌బోర్న్ టెస్టులో టాప్‌క్లాస్ బ్యాటింగ్‌తో తొలి టెస్టు సెంచ‌రీ న‌మోదు
  • తాజాగా రూ. 25 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తి ప్ర‌క‌టించిన ఏసీఏ
  • ఈ మేర‌కు ఏసీఏ ప్రెసిడెంట్, ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్ర‌క‌ట‌న‌

బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సిరీస్‌లో భార‌త్ త‌ర‌ఫున టాప్ స్కోర‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఈరోజు టాప్‌క్లాస్ బ్యాటింగ్‌తో తొలి టెస్టు సెంచ‌రీని కూడా నమోదు చేశాడు. 

దీంతో అత‌నికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తాజాగా న‌గ‌దు బ‌హుమ‌తి ప్ర‌క‌టించింది. ఏసీఏ ప్రెసిడెంట్, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ రూ.25 ల‌క్ష‌ల న‌గ‌దు ప్రోత్సాహ‌కం ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే సీఎం చంద్ర‌బాబు నాయుడు చేతుల మీదుగా ఈ న‌గ‌దు బ‌హుమ‌తిని అంద‌జేస్తామ‌న్నారు.  

ఈ సంద‌ర్భంగా, బీజీటీలో నితీశ్ రెడ్డి ఆల్‌రౌండ‌ర్ షోతో అద‌ర‌గొడుతున్నాడ‌ని ఏసీఏ ప్రెసిడెంట్ మెచ్చుకున్నారు. నేటి యువ‌త‌కు నితీశ్ ఆద‌ర్శ‌మ‌ని, ఇలాంటి యువ క్రికెట‌ర్ల‌ను కూట‌మి ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తుంద‌ని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ లు ఆడేలా విశాఖ స్టేడియంను తీర్చిదిద్దుతున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. 

అంతేగాక ఏపీకి కూడా ఐపీఎల్ టీమ్‌ను సిద్ధం చేసేలా ఏసీఏ ఆలోచ‌న చే‌స్తోందన్నారు. ఇక దేశంలోనే అత్యాధునిక వ‌స‌తుల‌తో కూడిన స్టేడియంను రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మిస్తామ‌ని కేశినేని శివ‌నాథ్ పేర్కొన్నారు.   

  • Loading...

More Telugu News