Borewell Boy: బోరుబావిలో పడిన పదేళ్ల బాలుడు.. 18 గంటల తర్వాత బయటికి!

Boy who fell into borewell in Madhya Pradesh rescued

  • మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో నిన్న బోరుబావిలో పడిన బాలుడు
  • 18 గంటలపాటు శ్రమించి బాలుడిని బయటకు తీసిన సహాయక బృందాలు
  • ప్రస్తుతం అస్మారక స్థితిలో బాలుడు.. ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స

మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో బోరుబావిలో పడిన పదేళ్ల బాలుడిని ఎట్టకేలకు విజయవంతంగా బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. బాలుడు సుమిత్ శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. ఆ వెంటనే రంగంలోకి దిగిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్) ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. 

రాతంత్రా జరిగిన పలు ప్రయత్నాల తర్వాత ఈ ఉదయం 9.30 గంటల సమయంలో బాలుడిని వెలికి తీశారు. ప్రస్తుతం అతడు అపస్మారకస్థితిలో ఉన్నాడని, శ్వాస నెమ్మదిగా తీసుకుంటున్నాడని అధికారులు తెలిపారు. బోరుబావికి సమాంతరంగా 40 అడుగుల లోతులో మరో గొయ్యి తవ్విన సహాయక బృందాలు బాలుడికి ఆక్సిజన్ అందిస్తూ ప్రాణాలు కాపాడగలిగాయి. బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

రాజస్థాన్‌లో మూడేళ్ల బాలిక
రాజస్థాన్‌లోని కోట్‌పుత్లిలో 700 అడుగుల లోతైన బోరుబావిలో పడిన మూడేళ్ల బాలిక 150 అడుగుల లోతులో చిక్కుకుపోయింది. ఆమె కోసం వారం రోజులుగా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇదే జిల్లాలోని దౌసా జిల్లాలో రెండు వారాల క్రితం ఐదేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. 55 గంటలపాటు శ్రమించినప్పటికీ అతడి ప్రాణాలను కాపాడలేకపోయారు. 

  • Loading...

More Telugu News