Payyavula Keshav: రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చేది కాంట్రాక్టర్లే: పయ్యావుల

Payyavula comments on previous govt
  • గత ప్రభుత్వం కాంట్రాక్టర్ల వ్యవస్థను చంపేసిందన్న పయ్యావుల
  • తమ ప్రభుత్వం కాంట్రాక్టర్లను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తోందని వెల్లడి
  • ప్రాధాన్యత ప్రకారం అందరికీ బిల్లులు చెల్లిస్తున్నామని వివరణ 
రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చేది కాంట్రాక్టర్లేనని, అలాంటి కాంట్రాక్టర్ల వ్యవస్థను గత ప్రభుత్వం చంపేసిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లను దోచేస్తే, తమ ప్రభుత్వం వారిని అభివృద్ధిలో భాగస్వాములుగా చేస్తోందని అన్నారు. 

గత ప్రభుత్వం 93 కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేసిందని ఆరోపించారు. ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 74 కేంద్ర పథకాలను పునరుద్ధరించినట్టు పయ్యావుల తెలిపారు. ప్రాధాన్యత ప్రకారం అన్ని కంపెనీలకు బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. త్వరలో కార్పొరేషన్లకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తామని వివరించారు. 

వైసీపీ సర్కారు రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పక్కదారి పట్టించిందని ఆరోపించారు. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల మేర అప్పు ఉందని, ప్రతి నిమిషానికి పరిస్థితులు అంచనా వేసుకుని జాగ్రత్తగా పాలన చేయాల్సి వస్తోందని వివరించారు.
Payyavula Keshav
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News