Chandrababu: రియల్ టైమ్ గవర్నెన్స్ పై చంద్రబాబు సమీక్ష... అధికారులకు దిశానిర్దేశం

CM Chandrababu reviews on RTGS

  • ప్రజాభిప్రాయానికి తగ్గట్టే పాలన ఉండాలన్న చంద్రబాబు
  • ప్రజల నుంచి అధికారులు అభిప్రాయాలు సేకరించాలని సూచన
  • ప్రజాభిప్రాయం మేరకు అధికారులు పనితీరు మార్చుకోవాలని స్పష్టీకరణ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ (ఆర్టీజీఎస్)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పాలనపై దిశానిర్దేశం చేశారు. ప్రజాభిప్రాయానికి తగ్గట్టే రాష్ట్రంలో పాలన ఉండాలని స్పష్టం చేశారు. పథకాలు, కార్యక్రమాల అమలుపై ప్రజాభిప్రాయం సేకరించాలని సూచించారు. ప్రజాభిప్రాయం మేరకు అధికారులు పనితీరు మార్చుకోవాలని అన్నారు. 

ఉచిత ఇసుక విధానం సజావుగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇసుక రీచ్ ల్లో సీసీ కెమెరాలు, వాహనాల జీపీఎస్ ద్వారా పర్యవేక్షణ జరగాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇసుక విధానంపై ఐవీఆర్ఎస్ పద్ధతిలో అభిప్రాయ సేకరణ జరగాలని సూచించారు. 

అటు, ఆలయాల్లో భక్తుల నుంచి, ఆర్టీసీ ప్రయాణికుల నుంచి, ఆసుపత్రుల్లో రోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాలని తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో క్యూఆర్ కోడ్ లు ఏర్పాటు చేయాలని అన్నారు.

  • Loading...

More Telugu News