yash: కన్నడ హీరో యశ్ ఆసక్తికర ప్రకటన

yash request to his fans about birthday celebrations

  • ఈ ఏడాది జనవరి 8న నటుడు యశ్ పుట్టిన రోజు వేడుకల ఏర్పాట్లలో విషాదం 
  • ముగ్గురు అభిమానుల మృతి, మరో ముగ్గురికి గాయాలు
  • తన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగ వేడుకలు నిర్వహించవద్దని అభిమానులకు సూచించిన నటుడు యశ్

సహజంగా సినీ అభిమానులు వారి అభిమాన నటుడి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ వేడుకల సందర్భంగా జరిగే ఏర్పాట్లలో అపశ్రుతి చోటు చేసుకుంటే దాన్ని జీవిత కాలం ఎవరూ మరిచిపోలేరు. ప్రతి జన్మదిన వేడుకల సందర్భంలోనూ ఆ విషాద ఘటన గుర్తుకు వస్తుంటుంది. ఈ క్రమంలో కేరళ ప్రముఖ సినీ నటుడు యశ్ తన పుట్టిన రోజుని పురస్కరించుకుని అభిమానులకు కీలక ప్రకటన చేశారు. 

తన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా వేడుకలు నిర్వహించవద్దని సోషల్ మీడియా వేదికగా కోరారు. ఈ ఏడాది జనవరి 8న యశ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు కటౌట్లు ఏర్పాటు చేస్తుండగా, కరెంట్ షాక్‌కు గురై ముగ్గురు అభిమానులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో బాధితులను పరామర్శించిన నటుడు .. వారి బాధ్యత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి తన పుట్టిన రోజు వస్తుందంటే భయమేస్తోందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. 
 
‘కొత్త సంవత్సరం వస్తుందంటే మనం కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించాలి. ఎన్నో ఏళ్లుగా మీరంతా నాపై చూపిస్తున్న అభిమానం అసాధారణమైంది. ఆ క్రమంలో దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలూ జరిగాయి. మన ప్రేమ భాష‌ను మార్చుకోవాల్సిన సమయమిది. ముఖ్యంగా నా బర్డ్‌డే సెలబ్రేషన్స్ విషయంలో.. మీ అభిమానాన్ని, ప్రేమను గ్రాండ్ ఈవెంట్స్‌తో చూపే ప్రయత్నం చేయొద్దు. మీరంతా సురక్షితంగా ఉండటం, అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం, ఆనందంగా ఉండటమే నాకు పెద్ద బహుమతి. సినిమా షూటింగ్ కారణంగా నా పుట్టిన రోజున సిటీలో ఉండను. కానీ .. మీరు హృదయపూర్వకంగా చెప్పే శుభాకాంక్షలు నాకు చేరతాయి. నాలో స్పూర్తిని నింపుతాయి’ అంటూ ఎక్స్ వేదికగా యశ్ పోస్టు చేశారు. ఈ సందర్భంగా అభిమానులందరికీ ముందుగానే నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.   

  • Loading...

More Telugu News