Regina Cassandra: పుట్టినప్పుడు ముస్లింగా ఉన్నా.. ఆ తర్వాత క్రిస్టియన్ గా మారాను: రెజీనా

Rejina Cassandra comments on her religion

  • తన తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్ అని చెప్పిన రెజీనా
  • ఆరేళ్ల వయసులో తన తల్లిదండ్రులు విడిపోయారని వెల్లడి
  • అప్పటి నుంచి తాను క్రిస్టియన్ గా మారిపోయానన్న రెజీనా

ప్రముఖ సినీ నటి రెజీనా కసాండ్రా తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. పలు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ లో కూడా రెజీనా మెరిసింది. వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... తన జీవితానికి సంబంధించిన ఓ కీలక విషయం గురించి చెప్పింది. 

పుట్టినప్పుడు తాను ముస్లింగా ఉన్నానని... ఆ తర్వాత క్రిస్టియన్ మతంలోకి మారానని రెజీనా తెలిపింది. తన తండ్రి ముస్లిం అని, తన తల్లి క్రిస్టియన్ అని... ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారని చెప్పింది. తన తండ్రి ముస్లిం కాబట్టి.... పుట్టినప్పటి నుంచి ముస్లిం మతస్తురాలిగా పెరిగానని తెలిపింది. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు అమ్మ, నాన్న విడిపోయారని... దీంతో, అమ్మ మళ్లీ క్రిస్టియన్ గా మారి... తన పేరు 'రెజీనా'కు 'కసాండ్రా'ను జత చేసిందని వెల్లడించింది. అప్పటి నుంచి తాను క్రిస్టియన్ గా ఉన్నానని చెప్పింది.

  • Loading...

More Telugu News