Kodali Nani: కొడాలి నాని ప్రధాన అనుచరుడిని అసోంలో అరెస్ట్ చేసిన పోలీసులు

Kodali Nani follower arrested in Assam

  • గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి కేసు
  • దాడికి సూత్రధారిగా భావిస్తున్న కాళీని అరెస్ట్ చేసిన గుడివాడ పోలీసులు
  • ఇదే కేసులో ఇప్పటికే రిమాండ్ లో ఉన్న 13 మంది వైసీపీ కార్యకర్తలు

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాల కాళీని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడలోని టీడీపీ కార్యాలయంపై దాడి, టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడి ఘటనలకు సూత్రధారిగా కాళీని పోలీసులు గుర్తించారు. ఆయనపై కేసు నమోదు చేశారు. 

ఈ కేసులో ఇప్పటికే 13 మంది కార్యకర్తలు అరెస్టయి రిమాండ్ లో ఉన్నారు. పరారీలో ఉన్న కాళీని అసోంలో గుడివాడ పోలీసులు పట్టుకున్నారు. కాళీ కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు.

  • Loading...

More Telugu News