Hyderabad: హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో హైడ్రా కూల్చివేతలు
- భగీరథమ్మ చెరువు బఫర్ జోన్లో కూల్చివేతలు
- ఇటీవల అక్రమంగా రేకుల షెడ్డు నిర్మించినట్లు ఫిర్యాదులు
- జేసీబీలతో కూల్చివేసిన అధికారులు
హైడ్రా మరోసారి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ భగీరథమ్మ చెరువు బఫర్ జోన్‌లోని అక్రమ నిర్మాణాలను అధికారులు జేసీబీలతో కూల్చివేయిస్తున్నారు. ఈ చెరువు బఫర్ జోన్‌లోని రెండు ఎకరాల స్థలంలోని కొంత భాగంలో ఇటీవల ఆక్రమణదారులు రేకుల షెడ్లు నిర్మించారు.
ఈ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం నాడు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి భగీరథమ్మ చెరువు వద్దకు చేరుకొని జేసీబీలతో నిర్మాణాలను కూల్చివేశారు.