Welcome 2025: వెల్కమ్ 2025.... కళ్లు మిరుమిట్లు గొలిపేలా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన ఆస్ట్రేలియా

Australia welcomes 2025 with a massive fireworks display at Sydney Harbour

 


పాతకు వీడ్కోలు పలుకుతూ, కొత్తకు స్వాగతం చెబుతూ... ప్రపంచవ్యాప్తంగా 2025 సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నారు. మొదటగా పసిఫిక్ ద్వీపదేశాలు నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. తాజాగా, ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని సిడ్నీ నగరం కూడా 2025 సంవత్సరానికి వెల్కమ్ చెప్పింది. 

కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా విన్యాసాలు, ఆకట్టుకునే లేజర్ లైటింగ్ తో ప్రఖ్యాత సిడ్నీ హార్బర్, ఓపెరా హౌస్ జిగేల్మన్నాయి. వేలాది మంది ప్రజలు సిడ్నీ హార్బర్ వద్దకు చేరుకుని నూతన సంవత్సర ఘడియలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తోటివారికి హ్యాపీ న్యూయర్ చెబుతూ 2025లోకి ప్రవేశించారు. 

సిడ్నీ హార్బర్ వద్ద న్యూ ఇయర్ సంబరాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News