Ram Charan: 'గేమ్ ఛేంజర్' పాటల ఖర్చుతో మరో భారీ సినిమా తియ్యొచ్చే!

Game Changer movie update

  • 'గేమ్ ఛేంజర్'గా రామ్ చరణ్
  • శంకర్ మార్క్ సినిమా ఇది 
  • 350 కోట్లతో నిర్మితమైన సినిమా 
  • పాటల ఖర్చు 75 కోట్లు అంటూ టాక్ 
  • సంక్రాంతికి భారీ రిలీజ్    


శంకర్ సినిమా అంటే యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ .. మాస్ ఆడియన్స్ కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. శంకర్ తయారు చేసుకునే కథల్లో ఇటు వినోదం .. అటు సందేశం కనిపిస్తూ ఉంటాయి. అలాగే యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత దక్కుతూ ఉంటుంది. ఇక కథ ఏదైనా ఆయన సినిమాలలో భారీతనం ప్రధాన బలంగా నిలుస్తుంది. ప్రతి ఫ్రేమ్ లో ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. పాటల విషయానికి వస్తే, వాటికి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు. 

శంకర్ సినిమాలను నాలుగు భాగాలుగా విడగొట్టొచ్చు కథ - యాక్షన్ - పాటలు - లొకేషన్స్ గా వాటిని గురించి చెప్పుకోవచ్చు. ఒక సినిమా కోసం అనుకున్న బడ్జెట్ లో పావువంతు పాటల చిత్రీకరణ కోసమే ఆయన కేటాయిస్తూ ఉంటారు. అదే పద్ధతిని 'గేమ్ ఛేంజర్' విషయంలోను ఫాలో అయినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం దిల్ రాజు కేటాయించిన బడ్జెట్ 350 కోట్లు అయితే, 5 పాటల కోసం 75 కోట్లను ఖర్చు చేశారనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. 

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో లిరికల్ సాంగ్ ను వదులుతూ వస్తున్నారు. ప్రతి పాట భారీతనాన్ని సంతరించుకోవడం కనిపిస్తూనే ఉంది. కొన్ని సాంగ్స్ ను విదేశాలలో కూడా చిత్రీకరించడం .. మరి కొన్ని సాంగ్స్ ను వందలాదిమంది డాన్సర్స్ కాంబినేషన్లో షూట్ చేయడం జరిగింది. ప్రత్యేకమైన సెట్స్ కూడా వేయడం జరిగింది. ఒక్కోపాట చిత్రీకరణను పూర్తిచేయడానికి ఎక్కువ రోజులు పట్టింది. అందువలన పెద్ద మొత్తంలో ఖర్చు అయినట్టు తెలుస్తోంది. అంటే ఈ సినిమా పాటల కోసం చేసిన ఖర్చుతో మరో భారీ సినిమా తియ్యొచ్చన్నమాట. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా, ఏ స్థాయిలో పాటలు పండగ చేస్తుందో చూడాలి మరి.

  • Loading...

More Telugu News