Balakrishna: ఇంతవరకూ చూడని ఫైట్స్ చూపించే 'డాకు మహారాజ్'

Daku Maharaaj Special

  • సంక్రాంతి బరిలో 'డాకు మహారాజ్'
  • మాస్ ఆడియన్స్ కి పండగేనన్న నిర్మాత
  • డిఫరెంట్ ఫైట్స్ డిజైన్ చేశామన్న బాబీ 
  • రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్


హీరోలకు గల క్రేజ్ ను బట్టి వారు చేసే ఫైట్స్ ను కంపోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ఫైట్స్ కోలీవుడ్ లో రజనీ చేయాలి .. మరి కొన్ని ఫైట్స్ టాలీవుడ్ లో బాలయ్య బాబు చేయాలని అంటూ ఉంటారు. ఎందుకంటే కొన్ని ఫైట్స్ వాళ్లు చేస్తేనే కరెక్టుగా అనిపిస్తాయి .. కనెక్టు అవుతాయి.  అవి అసాధ్యాలైనా .. సాధ్యాలుగానే కనిపిస్తూ ఉంటాయి. ఈ కారణంగానే టాలీవుడ్ లో బాలయ్య సినిమాల నుంచి భారీ యాక్షన్ సీన్స్ ను అభిమానులు ఆశిస్తూ ఉంటారు. అలాంటి ఫైట్స్ 'డాకు మహారాజ్'లో పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.

బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో 'డాకు మహారాజ్' రూపొందింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. నాగవంశీ - సాయిసౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. బాబీ ఇంతకుముందు చేసిన 'వాల్తేరు వీరయ్య'ను మించి ఈ సినిమా ఉంటుందని నాగవంశీ చెప్పడం, బాలయ్య అభిమానులలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.      

ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయనీ, ఇంతవరకూ బాలయ్య బాబు సినిమాలలో చూడని యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో చూడొచ్చని బాబీ చెప్పడం మరింత హైప్ తీసుకొచ్చింది. బాలయ్య క్రేజ్ కి తగినట్టుగా .. ఆయన పవర్ ఫుల్ రోల్ కి తగినట్టుగా డిఫరెంట్ గా డిజైన్ చేయబడిన ఫైట్స్ విజిల్స్ వేయించడం ఖాయమని చెబుతున్నారు. ఇక తమన్ స్వరపరిచిన మాస్ బీట్స్ కూడా బాలయ్య ఫ్యాన్స్ ఆకలి తీర్చనున్నాయి. జనవరి 12న విడుదలవుతున్న ఈ సినిమా ఏ స్థాయి రికార్డులను సెట్ చేస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News