Venkatesh: ఈ సంక్రాంతికి హ్యాట్రిక్ హిట్ ఖాయమంటున్న వెంకీ ఫ్యాన్స్!
- సంక్రాంతికి వస్తున్న వెంకీ మూవీ
- ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో సాగే కథ
- సందడిని .. అల్లరిని కలిపి అందిస్తున్న అనిల్ రావిపూడి
- ప్రత్యేక ఆకర్షణగా మీనాక్షి చౌదరి - ఐశ్వర్య రాజేశ్
వెంకటేశ్ కథానాయకుడిగా రూపొందిన 'సంక్రాంతికి వస్తున్నాం'పై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. పండగ నేపథ్యం .. పండగ సందర్భంతో ముడిపడిన కంటెంట్ ఇది. అందువలన సంక్రాంతికి ఒక రేంజ్ సందడి షురూ అయినట్టేనని అంతా రెడీ అయ్యారు. ఈ సినిమా నుంచి వదులుతున్న అప్ డేట్స్ అందరిలో మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. కథాకథనాల సంగతి అటుంచితే, తారాగణంతో ఎక్కువగా ఆకట్టుకుంటోంది.
వెంకటేశ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అలాగే అనిల్ రావిపూడి తన కంటెంట్ పై ఏ స్థాయిలో కసరత్తు చేస్తాడనేది కూడా అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో కామెడీని పరిగెత్తిస్తున్న దర్శకుడిగా ఎక్కువ మార్కులు పడింది ఆయనకే. గతంలో వెంకీ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'ఎఫ్ 2' .. 'ఎఫ్ 3' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అది కూడా ఈ సినిమాపై అందరూ దృష్టి పెట్టడానికి ఒక కారణమైంది.
ఈ సినిమా జోనర్ ఏంటో తెలియగానే 'సంక్రాంతికి వచ్చేయండి' అని అభిమానులే ముందుగా వెల్ కమ్ చెప్పారు. వెంకటేశ్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉండటం .. మీనాక్షి చౌదరి గ్లామర్ లుక్ .. ఐశ్వర్య రాజేశ్ హోమ్లీ లుక్ .. పండగకి అవసరమైన ఉమ్మడి కుటుంబంలోని సందడి .. అల్లరి .. ఇవన్నీ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. క్రితం ఏడాది సంక్రాంతికి 'సైన్ధవ్'తో ఫ్లాప్ అందుకున్న వెంకీ, ఈ సారి అనిల్ రావిపూడితో హ్యాట్రిక్ హిట్ అందుకోవడం ఖాయమనేది ఫ్యాన్స్ టాక్.