Chandrababu: ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానంతరం పండితులు సీఎంకు వేదాశీర్వచనాలు పలికి... తీర్థప్రసాదాలను అందజేశారు.
అంతకుముందు సీఎం చంద్రబాబుకు అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. దాంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు.