KTR: కేసీఆర్ నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలు అందుకోవాలి: కేటీఆర్

KTR launches brs new year calendar

  • పార్టీ కార్యాలయంలో కొత్త ఏడాది క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కేటీఆర్
  • బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో తిరిగి ప్రజల ఆశీస్సులు పొందాలని ఆకాంక్ష
  • అడ్డంకులు ఎదుర్కొనే శక్తిని భగవంతుడు ఇవ్వాలన్న కేటీఆర్

కేసీఆర్ నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలు అందుకోవాలని, ప్రజల ఆశీస్సులు తిరిగి పూర్తిస్థాయిలో పొందాలని, కొత్త సంవత్సరంలో మనకు ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కొనే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నూతన సంవత్సరం నేపథ్యంలో ఆయన ఈరోజు తెలంగాణ భవన్‌కు వచ్చారు. పార్టీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ చావు నోట్లో త‌ల‌పెట్టి తెలంగాణ సాధించిన నాయ‌కుడు అన్నారు. మ‌నంద‌రం మ‌న‌స్ఫూర్తిగా కాంక్షిస్తున్న‌ది ఒక్కటేనని... కేసీఆర్ తిరిగి రాష్ట్రానికి సీఎం కావాల‌నే ఒకే ఒక్క కోరికతో గ‌ట్టిగా ప‌ని చేస్తున్నామన్నారు.

ఈ ప్రయాణంలో మనకు ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కొనే శక్తి భగవంతుడు అందరికీ ప్రసాదించాలని పేర్కొన్నారు. అందరూ వారి వారి కుటుంబాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కులమతాలకు అతీతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ దేశం, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News