Team India: టీమిండియాకు చేదు జ్ఞాప‌కాన్ని మిగిల్చిన 2024... ఇలా జ‌ర‌గ‌డం 45 ఏళ్ల త‌ర్వాత ఇదే మొద‌టిసారి!

Team India Hits Humiliating 45 Year Old Low Finish 2024 Without A Single ODI Win

  • ఒక్క వన్డే విజయం లేకుండానే 2024ను ముగించిన భార‌త్‌
  • ఇలా జ‌ర‌గ‌డం 1979లోనే ఆఖ‌రిసారి
  • ఓవరాల్‌గా భారత్ ఎలాంటి వన్డే విజయం లేకుండా ఏడాది పూర్తి చేయడం ఇది నాలుగోసారి

2024లో టీమిండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలుచుకుని అభిమానుల 17 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించింది. అలాగే టెస్టుల్లోనూ కొన్ని అద్భుత విజ‌యాలు న‌మోదు చేసింది. కానీ, వ‌న్డేల్లోనే 2024 భార‌త జ‌ట్టుకు అంత‌గా క‌లిసి రాలేదు. అయితే, 50 ఓవ‌ర్ల ఫార్మాట్ లో ఈ ఏడాది టీమిండియా ఎక్కువ మ్యాచ్ లు ఆడ‌లేదు. 

2024లో శ్రీలంకతో భారత్ ఏకైక వన్డే సిరీస్ మాత్ర‌మే ఆడింది. ఈ సిరీస్‌ను ఆతిథ్య శ్రీలంక జ‌ట్టు 2-0 తేడాతో గెలుచుకుంది. దీంతో భారత్ ఒక్క వన్డే విజయం కూడా లేకుండానే 2024ను ముగించింది. త‌ద్వారా ఓ చెత్త రికార్డును మూట‌క‌ట్టుకుంది. 

45 ఏళ్ల త‌ర్వాత భార‌త్ ఇలా ఓ ఏడాదిని ఒక్క వ‌న్డే విజ‌యం లేకుండా ముగించింది. ఆఖ‌రిసారిగా 1979లో ఇలా జ‌రిగింది. ఆ తర్వాత మ‌ళ్లీ ఇప్పుడే ఇలా జ‌ర‌గ‌డం. ఓవరాల్‌గా భారత్ ఎలాంటి వన్డే విజయం లేకుండా ఏడాది పూర్తి చేయడం ఇది నాలుగోసారి. 

  • Loading...

More Telugu News