SSMB29: 'ఎస్ఎస్ఎంబీ29' మూవీ లాంచ్‌కి ముహూర్తం ఖ‌రారు!... ఎప్పుడంటే...!

Mahesh Babu SS Rajamouli Film SSMB29 Will be Launch Tomorrow

  • ఎస్ఎస్ రాజ‌మౌళి, మ‌హేశ్ బాబు కాంబినేష‌న్‌లో 'ఎస్ఎస్ఎంబీ29' 
  • రేపు ఈ ప్రాజెక్టును లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్న‌ట్లు టాలీవుడ్‌ టాక్‌
  • హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో పూజా కార్య‌క్ర‌మం అంటూ ప్ర‌చారం
  • దీనిపై మేక‌ర్స్‌ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌ని వైనం

టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌గా... ఇది ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందా అని అభిమానులు ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. 'ఎస్ఎస్ఎంబీ29' పేరుతో ప్ర‌చారంలో ఉన్న ఈ ప్రాజెక్టు గురించి కొత్త సంవ‌త్స‌రం కానుక‌గా ఓ వార్త నెట్టింట‌ బాగా వైర‌ల్ అవుతోంది. 

ఈ మూవీ లాంచ్‌కి ముహూర్తం ఖ‌రారు అయింద‌నేది దాని సారాంశం. రేపు (జ‌న‌వ‌రి 2న‌) ఈ ప్రాజెక్టును లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్న‌ట్లు సినీ ప‌రిశ్ర‌మ టాక్‌. గురువారం నాడు ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మం జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం. 

హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఈ మూవీ కోసం తీర్చిదిద్దిన భారీ సెట్‌లోనే ఈ పూజా కార్య‌క్ర‌మం ఉండ‌నుందని తెలుస్తోంది. అయితే, చిత్రం యూనిట్ నుంచి మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.
   
ఇక ఈ చిత్రం యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌గా ఉంటుంద‌ని కథా ర‌చ‌యిత విజయేంద్ర‌ప్ర‌సాద్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ కూడా భాగం కానున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై ప్ర‌ముఖ నిర్మాత కేఎల్ నారాయ‌ణ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 

ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తున్నారు. ఇక‌ జ‌క్క‌న్న సినిమా కోసం సూపర్‌స్టార్ మ‌హేశ్ బాబు ఇప్ప‌టికే పూర్తిగా మేకోవ‌ర్ అయ్యారు. పొడ‌వాటి జుట్టు, గ‌డ్డంతో ఉన్న ర‌గ్ డ్ లుక్ ఫ్యాన్స్‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది. 

  • Loading...

More Telugu News