APGVB: మీరు ఏపీజీవీబీ బ్యాంకు ఖాతాదారులా? తెలంగాణలో మీరు ఇవి మార్చుకోవాల్సిందే!
- తెలంగాణలోని ఏపీజీవీబీ బ్యాంకు శాఖలు టీజీబీలో విలీనం
- నేటి నుంచి అమల్లోకి వచ్చిన విలీనం
- తెలంగాణలో కస్టమర్ల కోసం మార్గదర్శకాలు జారీ చేసిన బ్యాంకు
మీరు తెలంగాణలోని ఏపీజీవీబీ బ్యాంకు ఖాతాదారులా? అయితే ఇది మీ కోసమే. మీ బ్యాంకు శాఖలన్నీ ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ)లో విలీనం అయ్యాయి.
గ్రామీణ బ్యాంకులను పటిష్ఠపరిచేలా కేంద్రం తీసుకున్న 'ఒక రాష్ట్రం-ఒక గ్రామీణ బ్యాంకు' అనే నినాదంతో నాడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) ఏర్పడింది. ఏపీజీవీబీ తెలంగాణలోని శాఖలన్నీ ఇప్పుడు టీజీబీలో విలీనమయ్యాయి. ఈరోజు నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఏపీజీవీపీ ఖాతాలు కలిగిన తెలంగాణ కస్టమర్ల కోసం తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ) కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
మార్గదర్శకాలివే...
- ఏపీజీవీబీ బ్యాంకు ఏటీఎం కార్డులను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మీ ఖాతా కలిగిన శాఖలో సంప్రదించాలి.
- చెక్ బుక్ కలిగిన ఏపీజీవీబీ ఖాతాదారులకు కొత్త చెక్ బుక్కులను ఇప్పటికే వారి చిరునామాకు పంపించారు.
- ఇక నుంచి పాత చెక్ బుక్కులను వినియోగించవద్దు. పాత చెక్ బుక్ ఉంటే ఖాతా కలిగిన శాఖలో తిరిగి ఇచ్చివేయాలి.
- ఇప్పటికే జారీ చేసిన చెక్కులు 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి. కాబట్టి జారీ చేసిన చెక్కుల గురించి ఆందోళన అవసరం లేదు.
- ఏపీజీవీబీ మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులు, ప్లేస్టోర్/యాపిల్ స్టోర్ నుంచి టీజీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ను డౌన్ లౌడ్ చేసుకోవాలి.
- ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారులు www.tgbhyd.in ను సందర్శించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను కొనసాగించుకోవచ్చు.
- ఆర్టీజీఎస్, నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్కు ఉపయోగించే ఐఎఫ్ఎస్సీ కోడ్ కూడా మారింది. ఇకపై SBIN0RRDCGBన వినియోగించాలి.
- టీజీబీ వాట్సాప్ బ్యాంకింగ్ అండ్ మిస్డ్ కాల్ అలర్ట్ సేవల కోసం మొబైల్ నెంబర్ 92780 31313ని సంప్రదించాలి.
- ఈ మార్గదర్శకాలు ఏపీజీవీబీ తెలంగాణ ప్రాంత కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి.