Tarakka: మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య తారక్క
- మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం సంకల్పం
- నేడు కీలక పరిణామం
- మహా సీఎం ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయిన తారక్క
- తారక్క తలపై రూ.1 కోటి రివార్డు
మావోయిస్టులను ఏరిపారేసే లక్ష్యంతో కేంద్రం పక్కా కార్యాచరణను అమలు చేస్తున్న తరుణంలో, నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య తారక్క అలియాస్ విమల సీదం గడ్చిరోలిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. ఆమెతో మరో 10 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు.
తారక్క 80వ దశకంలో నక్సల్ ఉద్యమం పట్ల ఆకర్షితురాలై దళంలో చేరారు. ఆమెపై 4 రాష్ట్రాల్లో సుమారు 170 వరకు కేసులు ఉన్నాయి. తారక్క తలపై రూ.1 కోటి రివార్డు ఉంది. తారక్క ప్రస్తుతం మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.