Game Changer: రేపు 'గేమ్ చేంజర్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్... ముఖ్య అతిథిగా రాజమౌళి
- రామ్ చరణ్, శంకర్ కాంబోలో గేమ్ చేంజర్
- జనవరి 10న విడుదల
- రేపు (జనవరి 2) ట్రైలర్ రిలీజ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో రేపు (జనవరి 2) గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్టుగా హాజరవుతున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. గురువారం సాయంత్రం 5.04 గంటల నుంచి గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని పేర్కొంది.
గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయిక కాగా... అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్ర ఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమాలోని గీతాలు ఆడియన్స్ లోకి బలంగా వెళ్లాయి.