Nitish Kumar: లాలూ ప్రసాద్ యాదవ్ ఆఫర్... అలా స్పందించిన నితీశ్ కుమార్

Lalu Yadav Says Doors Open For Nitish Kumar

  • నితీశ్ కుమార్‌కు మా తలుపులు తెరిచే ఉన్నాయన్న లాలూ ప్రసాద్
  • నితీశ్ కుమార్ కూడా గేట్లు తెరవాలన్న మాజీ సీఎం
  • రెండు చేతులు జోడించి దండం పెట్టి.. నవ్వేసిన నితీశ్ కుమార్

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓ ఆఫర్ ఇచ్చారు. నితీశ్ కుమార్‌కు మా (ఇండియా కూటమి) తలుపులు తెరిచే ఉన్నాయని, ఆయన కూడా తన గేట్లు తెరవాలన్నారు. రెండు వైపుల తెరిస్తేనే ఇరువైపుల రాకపోకలు సులభతరమవుతాయని వ్యాఖ్యానించారు. తద్వారా ఆయనను ఇండియా కూటమిలోకి ఆహ్వానించారు.

లాలూ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు... నితీశ్ కుమార్‌ను ప్రశ్నించారు. మీరు కూటమిలోకి వస్తే స్వాగతిస్తామని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు కదా? అని మీడియా ప్రతినిధులు అడిగారు. దీనికి నితీశ్ కుమార్ తన రెండు చేతులను జోడించి దండం పెట్టి, ఓ చిరునవ్వు నవ్వారు.

  • Loading...

More Telugu News