Congress: సావర్కర్ పేరు వద్దు.. మన్మోహన్ పేరు పెట్టండి: కాంగ్రెస్
- ఢిల్లీలో ఓ కాలేజీకి శంకుస్థాపన చేయనున్న మోదీ
- కాలేజీకి వీర్ సావర్కర్ పేరు పెట్టిన ప్రభుత్వం
- మన్మోహన్ పేరు పెట్టాలని కాంగ్రెస్ డిమాండ్
ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలో నిర్మించనున్న ఓ కళాశాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. నజాఫ్ గఢ్ లో రూ. 140 కోట్లతో ఈ కళాశాలను నిర్మించబోతున్నారు. ఈ కాలేజీకి వీర్ సావర్కర్ పేరు పెట్టారు. ఈ పేరుపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
బ్రిటీష్ వారికి క్షమాపణ చెప్పి సావర్కర్ పింఛను తీసుకున్నారని కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నేతలు విమర్శించారు. అలాంటి వ్యక్తి పేరు కాలేజీకి పెట్టవద్దని అన్నారు. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను స్థాపించిన దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.