Shiv Sena: దేవేంద్ర ఫడ్నవీస్‌పై ఉద్దవ్ థాకరే శివసేన ప్రశంసలు

Shiv Sena praises Devendra Fadnavis over development plans for Gadchiroli

  • గడ్చిరౌలి జిల్లాను స్టీల్ సిటీగా మార్చాలని ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్ణయం
  • బీజేపీ ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రశంసించిన సామ్నా
  • గడ్చిరౌలిలో పర్యటించి కొత్త ఏడాది సందర్భంగా అభివృద్ధికి బీజం వేశారన్న శివసేన

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై ప్రతిపక్ష శివసేన (ఉద్ధవ్ థాకరే పార్టీ) ప్రశంసలు కురిపించింది. మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో నక్సల్స్ ప్రభావం ఎక్కువ. ఈ జిల్లాను స్టీల్ సిటీగా మార్చాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా చర్యలు చేపట్టింది.

ఈ ప్రాజెక్టుపై శివసేన (ఉద్దవ్ థాకరే వర్గం) పార్టీ తన పార్టీ పత్రిక సామ్నాలో ప్రశంసించింది. ఫడ్నవీస్ ప్రయత్నాలను మెచ్చుకుంది. ఫ‌డ్న‌వీస్‌ను 'దేవ భావు'గా పోల్చుతూ క‌థ‌నం రాసింది. మ‌హారాష్ట్ర‌లోని విద‌ర్భ ప్రాంతంలో ఉన్న గడ్చిరౌలిలో ఫ‌డ్న‌వీస్ పర్యటించారని, అక్క‌డ కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా అభివృద్ధికి బీజం వేసిన‌ట్లు ఆ క‌థ‌నంలో పేర్కొంది. శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ కూడా ఫ‌డ్న‌వీస్‌ను ప్రశంసించారు.

  • Loading...

More Telugu News