sydney test: రోహిత్ శర్మను అవమానించారు... టీమిండియా మేనేజ్ మెంట్ పై సిద్ధూ ఫైర్

navjot singh sidhu fires on indian team management bizarre decision of leaving rohit sharma out of sydney test

  • కీలక మ్యాచ్‌కు దూరమైన టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్
  • సిడ్నీ టెస్టులకు రోహిత్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడన్న బుమ్రా
  • మేనేజ్‌మెంట్ తప్పుడు నిర్ణయమంటూ కుండబద్దలు కొట్టిన మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్దు

టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో తను ఆడడంలేదు. వరుస ఓటములు, పేలవ ఫామ్‌తో బాధపడుతున్న రోహిత్‌ను పక్కన పెట్టాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగినట్లు గానే టాస్ సమయంలో మ్యాచ్‌కు దూరంగా ఉండాలని రోహిత్ నిర్ణయించుకున్నాడని బుమ్రా వెల్లడించడం, రోహిత్ స్థానంలో శుబ్‌మన్ గిల్ బరిలో దిగడం హాట్ టాపిక్ అయ్యాయి.   

అయితే, రోహిత్ తనకు తాను తప్పుకున్నాడా ? లేక అతడ్ని తీసేశారా ? అనేది క్లారిటీ లేదు. ఈ పరిణామాలపై పలువురు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా రోహిత్‌పై సానుకూలంగా స్పందించారు. రోహిత్ శర్మను అవమానించారంటూ గౌతం గంభీర్, టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. 

హిట్ మ్యాన్ లాంటి ఛాంపియన్ ప్లేయర్‌ను బెంచ్ మీద కూచోబెట్టడం ఏంటి ..? మరీ ఇంత దారుణమా ? అంటూ సిద్దు విస్మయం వ్యక్తం చేశారు. ఇంత కంటే ఘోరం మరొకటి ఉండదని అన్నారు. టీమ్‌‌కు కెప్టెన్‌గా ఉన్న ఆటగాడిని ఆడించకపోవడం కంటే పెద్ద తప్పు ఏదీ లేదన్నారు. ఇది తప్పుడు సంకేతాలు పంపిస్తుందని గంభీర్‌పై సిద్దు ఫైర్ అయ్యారు. రోహిత్‌కు గౌరవం ఇవ్వాలని, అతడు జట్టుకు ఎన్నో విజయాలు అందించాడని, ఆషామాషీ ప్లేయర్ కాదని అన్నారు. 

టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్న ఆటగాడిని సిరీస్ మధ్యలో ఇలా తీసేయడం సరికాదన్నారు. తనంత తాను పక్కకు జరిగే అవకాశం కూడా ఇవ్వకూడదని, ఇది తప్పుడు సంకేతాలను పంపిస్తోందన్నారు. క్రికెట్ చరిత్రలో ఇంతకు ముందు ఇలా ఎన్నడూ జరగలేదన్నారు. మార్క్ టేలర్, మహ్మద్ అజహరుద్దీన్ లాంటి కెప్టెన్లను చాలా మందిని చూశానని, వాళ్లు బ్యాడ్ ఫామ్ తోనూ ఏడాదికి పైగా టీమ్‌లో కొనసాగారని గుర్తు చేశారు. ఇలా అవమానకరంగా అతడ్ని పక్కకు జరపడం కరెక్టు కాదని, ఇది తప్పుడు నిర్ణయమని సిద్దు కుండ బద్దలు కొట్టారు. ఈ మేరకు సిద్దు పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  

  • Loading...

More Telugu News