Rohit Sharma: సిడ్నీ టెస్టులో ఆడకపోవడంపై స్పందించిన రోహిత్.. ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు!

Rohit Sharma clarifies about his retirement roumers

  • రిటైర్మెంట్ వార్తల్లో నిజం లేదన్న రోహిత్‌శర్మ
  • జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టీకరణ
  • ఐదో టెస్టు నుంచి విశ్రాంతి మాత్రమే తీసుకున్నానని వివరణ
  • ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసన్న కెప్టెన్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో ఎందుకు ఆడటం లేదన్న ఊహాగానాలకు కెప్టెన్ రోహిత్‌శర్మ తెరదించాడు. రెండో రోజు ఆట లంచ్ బ్రేక్‌లో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో మాట్లాడిన రోహిత్ సిడ్నీ టెస్టు నుంచి తాను విశ్రాంతి మాత్రమే తీసుకున్నట్టు చెప్పాడు. రిటైర్మెంట్ వార్తలపై స్పందిస్తూ.. అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదని స్పష్టం చేశారు. జట్టు అవసరాలే ముఖ్యమని, అందుకనే చివరి టెస్టు నుంచి విశ్రాంతి తీసుకున్నట్టు చెప్పాడు.

పెర్త్ టెస్టు విజయంలో కేఎల్ రాహుల్-యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ భాగస్వామ్యం ఎంతో విలువైనదని గుర్తు చేసుకున్నాడు. కాబట్టి ఆ జోడీని మార్చకూడదని అనుకున్నామని, అలాగే, ఫామ్ పరంగానూ రాహుల్ మెరుగ్గా ఉన్నాడని తెలిపాడు. జట్టు ప్రయోజనాల తర్వాతే తాను అని స్పష్టం చేశాడు. డ్రెసింగ్‌ రూములో ఎలాంటి సమస్యలు లేవన్నాడు. ఇద్దరు పిల్లల తండ్రినైన తనకు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసని రోహిత్ కుండ బద్దలుగొట్టాడు. 

  • Loading...

More Telugu News