Blast: యాదగిరిగుట్టలోని ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Blast In Premiur Explosive Company In Yadagirigutta Mandal
  • ఎనిమిది మంది కార్మికులకు గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
  • పెద్ద కందుకూరులోని ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ పరిశ్రమలో ఘటన
  • భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో భయంతో పరుగులు పెట్టిన కార్మికులు
యాదగిరిగుట్ట మండలంలోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలోని ఓ రియాక్టర్ పేలిపోవడంతో విధుల్లో ఉన్న ఎనిమిది మంది కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను యాజమాన్యం హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో కార్మికులు భయంతో పరుగులు పెట్టారు. పేలుడు జరిగిన రియాక్టర్ దగ్గరలో కార్మికులు ఎవరైనా ఉన్నారా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదని యాజమాన్యం తెలిపింది. పేలుడు జరిగిన వెంటనే సైరన్ మోగిస్తూ మిగతా కార్మికులను అప్రమత్తం చేసి ఫ్యాక్టరీ బయటకు తరలించినట్లు పేర్కొంది.
Blast
Factory
Yadagirigutta
Explosive Company

More Telugu News