Narendra Modi: ఈ నెల 8న విశాఖకు రానున్న ప్రధాని మోదీ
- ఏపీలో ప్రధాని మోదీ పర్యటన
- విశాఖలో ఏయూ ఇంజినీరింగ్ కాలేజి మైదానంలో సభకు హాజరు
- వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి రానున్నారు. ఈ నెల 8న మోదీ విశాఖలో పర్యటించనున్నారు. జనవరి 8 సాయంత్రం 4.15 గంటలకు ఆయన విశాఖ చేరుకుంటారు. సిరిపురం నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజి మైదానం వరకు నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు.
అనంతరం, ఏయూ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్ లో నిర్వహించే భారీ సభలో పాల్గొంటారు. ఈ సభ గంట పాటు జరగనుంది. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం, అదే రోజు రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి భువనేశ్వర్ బయల్దేరనున్నారు.