Australia vs India: సిడ్నీ టెస్టు.. టీమిండియా ఆలౌట్‌.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే..!

Australia need 162 Runs to Win Sydney Test

  • సిడ్నీ వేదిక‌గా భార‌త్‌, ఆసీస్ ఐదో టెస్టు
  • రెండో ఇన్నింగ్స్ లో భార‌త్‌ 157 ర‌న్స్‌కు ఆలౌట్
  • ఆస్ట్రేలియాకు 162 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యం
  • 6 వికెట్లు తీసి భార‌త ఇన్నింగ్స్‌ను కుప్ప‌కూల్చిన బోలాండ్‌

బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదిక‌గా జ‌రుగుతున్న ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 157 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. 141/6 ఓవ‌ర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట కొన‌సాగించిన భార‌త జ‌ట్టు మ‌రో 16 ప‌రుగులు జోడించి మిగ‌తా 4 వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 4 ప‌రుగుల ఆధిక్యాన్ని క‌లుపుకొని ఆతిథ్య ఆస్ట్రేలియాకు 162 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. 

భార‌త ఇన్నింగ్స్ లో రిష‌భ్ పంత్ 61 ర‌న్స్‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. మిగ‌తా బ్యాట‌ర్ల‌లో య‌శ‌స్వి జైస్వాల్ 22, కేఎల్ రాహుల్ 13, శుభ్‌మ‌న్ గిల్ 13, ర‌వీంద్ర జ‌డేజా 13, వాషింగ్ట‌న్ సుంద‌ర్ 12 ప‌రుగులు చేశారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో స్కాట్ బోలాండ్ 6 వికెట్లు తీసి భార‌త ఇన్నింగ్స్‌ను కుప్ప‌కూల్చాడు. అలాగే కెప్టెన్ పాట్‌ క‌మిన్స్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. వెబ్‌స్ట‌ర్ ఒక‌ వికెట్ సాధించాడు.  

ఇక 162 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా దాటిగా ఆడుతోంది. మూడు ఓవ‌ర్ల‌లోనే 35 ర‌న్స్ చేసింది. క్రీజులో కొన్‌స్టాస్ (18), ఉస్మాన్ ఖ‌వాజా (05) ఉన్నారు. 

  • Loading...

More Telugu News