Nara Lokesh: లోకేష్ ఎంత మంచోడంటే: మాజీ జడ్జి రామకృష్ణ సెన్సేషనల్ కామెంట్స్

Ex Judge Ramakrishna Interesting comments on Nara lokesh

  • నారా లోకేశ్‌కు పాదాభివందనం చేస్తా.. అది నా వ్యక్తిత్వాన్ని చంపుకోవడంకాదన్న మాజీ జడ్జి రామకృష్ణ
  • ఒక నిజాయితీ పరుడు సమాజంలో బతకడం ఎంత కష్టమో నా జీవితమే ఒక ఉదాహరణగా పేర్కొన్న రామకృష్ణ
  • నాలుగేళ్లు సాయం అందించి నారా లోకేశ్ ఆదుకున్నారన్న రామకృష్ణ

మా నాయకుడు నారా లోకేశ్ అంటూ మాజీ జడ్జి రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను పడిన ఇబ్బందులు, జైలులో అనుభవించిన నరకం, లోకేశ్ నుంచి అందిన సాయం గురించి మాజీ జడ్జి రామకృష్ణ వివరించారు. నాలుగు నెలల పాటు సబ్ జైలులో ఉన్న సమయంలో తనను ఎవరూ పట్టించుకోలేదన్నారు. నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూలంగా తనకు ప్రాణహాని ఉందంటూ రామకృష్ణ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 

జైలులో తనపై జరిగిన హత్యాయత్నం కుట్రపై నాడు చంద్రబాబు కూడా మీడియా ముఖంగా మాట్లాడి బెయిల్ కోసం లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. నారా లోకేశ్ మాత్రం నాలుగైదు సార్లు అడిగి అడిగి మరీ సాయం అందించారని రామకృష్ణ చెప్పారు. ‘మీరు సభలు నిర్వహిస్తున్నారు. ఒక్కో సభ నిర్వహించడానికి 4 నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు అంతా నేను ఇస్తాను. ఒక లక్ష రూపాయలు అదనంగా తీసుకోండి’ అని లోకేశ్ చెప్పారన్నారు. ఆయన ఎంత మంచి వాడంటే నాలుగు లక్షల ఖర్చు అయితే వాటితో పాటు ఒక లక్ష అదనంగా తీసుకోండి అని నచ్చజెప్పి బలవంతంగా ఆయన పర్సనల్ పీఏతో కలిపి సార్ ఎప్పుడు అడిగినా ఎంత అడిగినా రెండో మాట లేకుండా సమకూర్చమని సూచించారన్నారు. అలా నాలుగు సంవత్సరాలు నారా లోకేశ్ తనను కాపాడారని చెప్పుకొచ్చారు. 

ఒకప్పుడు ఒక జడ్జిగా ప్రోటోకాల్‌తో జీవించాను. ఆ తర్వాత పిల్లలు పెద్దవాళ్లయిన తర్వాత తాను ఇబ్బందుల్లో ఉండగా మాట్లాడే వాళ్లు లేరు. ఆ సందర్భంగా ఆయన తనను ఆదుకున్నారు. ఆయన చేసిన మేలు ఎలా మరిచిపోతామన్నారు. అందుకే చిన్నవాడైనా లోకేశ్ కాళ్లు పట్టుకుంటానని, అది ఆత్మాభిమానం చంపుకోవడం కాదని అన్నారు. నిజాయితీగా బతికేవాడి బాధ అనుభవించే వాడికొక్కడికే తెలుస్తుంది. తప్పుడు పనులు చేసే వెధవలకు వారు పడే బాధకు అర్ధం ఉండదన్నారు. ఒక నిజాయితీపరుడు సమాజంలో బతకడం ఎంత కష్టమో తన జీవితమే ఒక ఉదాహరణగా రామకృష్ణ పేర్కొన్నారు. 

ఎక్కడా తగ్గకుండా బయటి ప్రపంచానికి ఎలా ఉన్నామో తెలియకుండా జడ్జి రామకృష్ణ అంటే ఇంతే.. 12 సంవత్సరాలు ఒకే టెంపోతో ఒకే క్యారక్టర్‌తో నిలబడ్డానని, ఒక మాట కోసం నిలబడ్డానని, ప్రాణం మీదకు వచ్చినా క్యారెక్టర్ మార్చుకోలేదు, నిజాయితీని వదులుకోలేదన్నారు. లేదంటే నేడు జిల్లా జడ్జి స్థానంలో రేపు హైకోర్టు జడ్జి స్థానంకు వెళ్లి రాయల్టీగా బతకాల్సిన తాను కష్టాలు పడాలని, నా బిడ్డలు కష్టాలు పడాలని అనుకోను కదా అని పేర్కొన్నారు.  
 

  • Loading...

More Telugu News