DK Aruna: మా నాన్న నర్సిరెడ్డి ఎన్నో పోరాటాలు చేశారు... ప్రభుత్వానికి ఆయన పేరు గుర్తుకురాలేదా?: డీకే అరుణ
- పాలమూరు ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు ఎందుకన్న డీకే అరుణ
- ప్రాజెక్టు కోసం జైపాల్ రెడ్డి చేసింది ఏముందని ప్రశ్న
- జిల్లా కోసం తన తండ్రి, సోదరుడు ప్రాణాలు అర్పించారని వెల్లడి
పాలమూరు ప్రాజెక్టుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు కోసం జైపాల్ రెడ్డి చేసింది ఏముందని ప్రశ్నించారు. కావాలంటే, నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులకు జైపాల్ రెడ్డి పేరు పెట్టుకోవాలని సూచించారు.
"పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు మా నాన్న నర్సిరెడ్డి ఎన్నో పోరాటాలు చేశారు. చిట్టెం నర్సిరెడ్డి పేరు ప్రభుత్వానికి గుర్తుకురాలేదా? సీఎం రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియకపోయినా, మా నాన్న సేవలు సీనియర్ మంత్రులకు గుర్తులేవా? జిల్లా కోసం మా నాన్న, సోదరుడు ప్రాణాలు అర్పించారు" అని డీకే అరుణ పేర్కొన్నారు.