ap cabinet meeting: ఈ నెల 17న సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్

ap cabinet meeting on 17th of this month

  • ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 17న క్యాబినెట్ భేటీ
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్
  • కీలక అంశాలపై చర్చ

ఈ నెల 17న ఏపీ క్యాబినెట్ మరోసారి సమావేశం కానుంది. క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన సర్క్యులర్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ విడుదల చేశారు. వెలగపూడి సచివాలయం మొదటి భవనంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమవుతుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. క్యాబినెట్‌కు సంబంధించిన ఆయా శాఖల ప్రతిపాదనలను ఈ నెల 16వ తేదీలోగా పంపించాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. 

ఈ క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా గీత కార్మికుల కులాలకు మద్యం షాపుల కేటాయింపు, మద్యం ధరల పెంపుపై చర్చించనుంది. అలాగే ఇతర కీలక అంశాలపై క్యాబినెట్ భేటీలో చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపైనా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ తర్వాత మరుసటి రోజు సీఎం చంద్రబాబు బృందం దావోస్‌లో జరగనున్న ప్రపంచ వాణిజ్య సదస్సుకు వెళ్లనుంది.  
 
కాగా, ఈ నెల 2న ఏపీ క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో 14 కీలక అంశాలపై చర్చించి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని అమరావతిలో రూ.2,733 కోట్ల విలువైన పనులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 

  • Loading...

More Telugu News