aramghar to zoo park flyover: తీరనున్న ట్రాఫిక్ కష్టాలు ..నేడే ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం
- నగరంలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ అరాంఘర్ – జూపార్క్ పైవంతెన
- సాయంత్రం 4 గంటలకు పచ్చజెండా ఊపనున్న సీఎం రేవంత్ రెడ్డి
- 800 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న అరాంఘర్ – జూపార్క్ ఫ్లైఓవర్
హైదరాబాద్ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరంలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు 4.08 కిలోమీటర్ల పొడవున దాదాపు రూ.800 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్‌ను ఈ రోజు సాయంత్రం సీఎం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
వాస్తవానికి ఈ ఫ్లైఓవర్ ను గత ఏడాది డిసెంబర్ లోనే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. అయితే తమ పరిధిలోనే కార్యక్రమం చేపట్టాలంటూ ఇటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్, మరో పక్క ఎంపీ అసదుద్దీన్ వర్గాలు పట్టుబట్టడంతో ప్రారంభోత్సవం వాయిదా పడినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఎట్టకేలకు ఈ రోజు (సోమవారం) సీఎం రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ఈ ఆరు లైన్ల వంతెన నుంచి వాహనాల రాకపోకలకు పచ్చజెండా ఊపనున్నారు.
.