Game Changer: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అభిమానుల కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం

Dil Raju Announce Financial Assistance to Two Dead in Road Accident While They Returns from Game Changer Event
  • రాజమహేంద్రవరంలో 'గేమ్ ఛేంజ‌ర్' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈ వేడుక‌లో పాల్గొని తిరిగి ఇళ్ల‌కు వెళుతున్న క్ర‌మంలో రోడ్డు ప్ర‌మాదం
  • ప్ర‌మాదంలో  కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ మృతి
  • ఈ ఘ‌ట‌న గురించి తెలిసిన వెంట‌నే స్పందించిన‌ నిర్మాత దిల్‌రాజు 
  • త‌న వంతుగా మృతుల‌ కుటుంబాల‌కు చెరో రూ. 5ల‌క్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌ట‌న‌
'గేమ్ ఛేంజ‌ర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుగు ప్ర‌యాణంలో ప్ర‌మాద‌వశాత్తు మ‌ర‌ణించిన ఇద్దరు అభిమానుల‌కు నిర్మాత దిల్‌రాజు రూ.10 లక్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. శ‌నివారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో 'గేమ్ ఛేంజ‌ర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ వేడుక‌లో పాల్గొని తిరిగి ఇళ్ల‌కు వెళుతున్న క్ర‌మంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్‌(22) మ‌ర‌ణించారు. 

ఇక ఈ ఘ‌ట‌న గురించి తెలిసిన వెంట‌నే నిర్మాత దిల్‌రాజు మీడియా స‌మ‌క్షంలో స్పందించారు. ఆయ‌న మాట్లాడుతూ.. " 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘ‌నంగా జ‌రిగింది. ఆ విష‌యంపై మేం సంతోషంగా ఉన్న స‌మ‌యంలో ఇలా ఇద్ద‌రు అభిమానులు తిరుగు ప్ర‌యాణంలో జ‌రిగిన ప్ర‌మాదంలో చ‌నిపోవ‌టం ఎంతో బాధాక‌రం. వారి కుటుంబాల‌కు నేను అండ‌గా ఉంటాను. 

నా వంతుగా వారి కుటుంబాల‌కు చెరో రూ. 5 ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగ‌ల‌ను. వారికి నా ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాను" అని అన్నారు.
Game Changer
Dil Raju
Rajamahendravaram
Andhra Pradesh

More Telugu News