Honey Rose: హీరోయిన్ హనీరోజ్ కు లైంగిక వేధింపులు

Sexual harassment to Honey Rose

  • ఒక బిజినెస్ మేన్ తనను లైంగికంగా వేధిస్తున్నాడన్న హనీరోజ్
  • అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని మండిపాటు
  • అతనిపై చట్టపరంగా పోరాడతానన్న హనీరోజ్

'వీరసింహారెడ్డి' సినిమాలో బాలకృష్ణ సరసన నటించిన మళయాళ భామ హనీరోజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. కేరళకు చెందిన ఓ బిజినెస్ మేన్ తాను ఎక్కడకు వెళితే అక్కడికి వస్తూ తనను వేధిస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె తెలిపింది. ఆ వ్యక్తి గతంలో ఓ ఈవెంట్ కు తనను పిలిచాడని, అయితే ఇతర కారణాల వల్ల తాను హాజరుకాలేదని, దాన్ని మనసులో పెట్టుకుని తనపై ప్రతీకారం తీర్చుకునేందుకు తనను వెంబడిస్తున్నాడని చెప్పింది. 

తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని... అతనిపై చట్టపరంగా పోరాడతానని తెలిపింది. అతని వేధింపులను తాను ఎందుకు భరించాలని ప్రశ్నించింది. మరోవైపు హనీరోజ్ పై అసభ్యకరమైన మెసేజ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వ్యక్తిని తిరువనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News